మహేష్ బాబు-రాజమౌళి ‘SSMB-29’ సినిమాలో మలయాళ స్టార్.. హింట్ ఇస్తూ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB-29’.

మహేష్ బాబు-రాజమౌళి ‘SSMB-29’ సినిమాలో మలయాళ స్టార్.. హింట్ ఇస్తూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB-29’. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ మూవీకి సంబంధించిన చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ ఎన్నో వార్తలు ‘SSMB-29’ని ట్రెండింగ్‌లోకి తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మరోసారి ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

దానికి కారణం మలయాళ స్టార్ పృథ్వీరాజ్(Prithviraj) సుకుమారన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు అందులో ఏముందంటే.. ‘‘దర్శకుడిగా నా చేతిలోని సినిమాలన్నీ పూర్తి చేశాను. వాటికి సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. నటుడిగా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాను. పరభాష చిత్రంలో కనిపించనున్నా కానీ అందులో పెద్ద డైలాగులు ఉన్నాయని తెలిసి కాస్త భయపడుతున్నాను’’ అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. అయితే పృథ్వీరాజ్ ఈ పోస్ట్ ‘SSMB-29’ గురించే పెట్టాడని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో అలాంటి పోస్ట్ పెట్టి హింట్ ఇచ్చాడని చర్చించుకుంటున్నారు.

Next Story