లైంగిక వేధింపుల కేసు.. మలయాళ దర్శకుడు కుంజు మహమ్మద్ అరెస్ట్

by Malleboina Mahesh |

సినిమా రంగానికి చెందిన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మలయాళ దర్శకుడు, మాజీ ఎమ్మెల్యే పి.టి. కుంజు మహమ్మద్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

లైంగిక వేధింపుల కేసు.. మలయాళ దర్శకుడు కుంజు మహమ్మద్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా రంగానికి చెందిన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మలయాళ దర్శకుడు, మాజీ ఎమ్మెల్యే పి.టి. కుంజు మహమ్మద్‌ను (Former MLA P.T. Kunju Mohammed) పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFK) కోసం మలయాళ చిత్రాలను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా వారు ఒక హోటల్‌లో బస చేసిన సమయంలో తనను వేధించాడని సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల ప్రారంభంలోనే కంటోన్మెంట్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో కుంజు మహమ్మద్ ఇప్పటికే కోర్టు నుండి ముందస్తు బెయిల్ (Anticipatory Bail) పొంది ఉన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారం ఆయన విచారణాధికారి ముందు హాజరయ్యారు. దీంతో పోలీసులు ఆయన అరెస్టును అధికారికంగా నమోదు చేసి, వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. వామపక్ష మద్దతుతో గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా పనిచేసిన కుంజు మహమ్మద్, మలయాళ చిత్ర పరిశ్రమలో పేరున్న నిర్మాత, దర్శకుడిగా చలామని అవుతున్నారు. తాజాగా మహిళకు లైంగిక వేధింపుల కేసు (Sexual harassment case)లో అరెస్టు కావడంతో ఇండస్ట్రీతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనియాంశంగా మారిపోయారు.

Next Story