ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Chukka Sudharani |

మలయాళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి.

ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: మలయాళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. చిన్న సినిమాగా వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన మలయాళ మూవీ భరతనాట్యం-2 మోహినియాట్టం సైతం కాసులు వర్షం కురిపించింది. థియేటర్స్‌లో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది. వెండితెరపై సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ఈ డార్క్ కామెడీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మే 8న నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. కాగా.. ఈ డార్క్ కామెడీ మూవీలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్ కీలక పాత్రల్లో నటించారు.


Next Story