మెగా ఫ్యామిలీకి షాక్...రాంచరణ్ సినిమాను రిజెక్ట్ చేసిన నటి ?

by velandi.Saikiran |

మలయాళ నటి స్వాసికకు రామ్ చరణ్ తల్లి పాత్ర ఆఫర్ వచ్చిందట

మెగా ఫ్యామిలీకి షాక్...రాంచరణ్ సినిమాను రిజెక్ట్ చేసిన నటి ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు రామ్ చరణ్. అయితే అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తున్న నేపథ్యంలో.. సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. రాంచరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. 300 కోట్లతో వస్తున్నాయి ఈ సినిమాకు వెంకట సతీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్రను మలయాళం నటి రిజెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మలయాళ నటి స్వాసికకు రామ్ చరణ్ తల్లి పాత్ర ఆఫర్ వచ్చిందట. ఈ మేరకు స్వాసికను పెద్ది సినిమా బృందం అడిగినట్లు స్వయంగా ఆమె ఓ వీడియోలో వెల్లడించారు. అయితే.. ఆ పాత్రను స్వాసిక రిజెక్ట్ చేసిందట. రామ్ చరణ్ వయస్సు 40 సంవత్సరాలు అయితే.. స్వాసిక వయసు మాత్రం 33 సంవత్సరాలే. వయసు నేపథ్యంలోనే ఆ పాత్రను రిజెక్ట్ చేసినట్లు తాజాగా వెల్లడించింది స్వాసిక. రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తామని చెప్పినా వినలేదట. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Next Story