- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివకార్తికేయన్ సినిమాలో మలయాళ నటుడు?
శివ కార్తికేయన్, రామ్ కుమార్ బాలకృష్ణన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో మలయాళ నటుడు దిలీప్‌ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ ప్రస్తుతం రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఒక స్టార్ మలయాళ నటుడిని తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ యూనిట్ మలయాళ నటుడు దిలీప్‌ను ఆ కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నారని, అన్ని అనుకూలంగా ఉంటే ఈ సినిమాలో దిలీప్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో నిజంగానే దిలీప్ భాగమైతే ప్రాజెక్ట్ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కొంతకాలం క్రితం శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనే స్థాయి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ విషయానికి వస్తే ‘పార్కింగ్’ చిత్రంతో మంచి విజయం మరియు గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






