The Rajasaab: ‘ది రాజాసాబ్’ నుంచి మాళవిక స్పెషల్ పోస్టర్.. దేవకన్యలా ఆకట్టకుంటున్న బ్యూటీ

by Chukka Sudharani |

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

The Rajasaab: ‘ది రాజాసాబ్’ నుంచి మాళవిక స్పెషల్ పోస్టర్.. దేవకన్యలా ఆకట్టకుంటున్న బ్యూటీ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. సర్దార్-2, హృదయపూర్వం వంటి చిత్రాలతో పాటు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అవుతుంది ఈ అమ్మడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కామెడీ అండ్ హారర్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతుండగా.. దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అలాగే రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్‌తో మాళవిక మరింత ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. నేడు ఈ అమ్మడు పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా.. మాళవిక నటిస్తున్న సినిమాల నుంచి వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సర్దార్-2, హృదయపూర్వం నుంచి స్పెషల్ బర్త్‌డే విషెస్ రాగా.. రాజాసాబ్ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ విష్ చేశారు చిత్ర బృందం. రిలీజ్ చేసిన పోస్టర్‌లో వైట్ కలర్ శారీలో కనిపిస్తూ దేవకన్యలా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది మాళవిక. లింక్


Next Story