- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Malavika Mohanan: అతను ఆకర్షణీయమైనవాడు.. మొదటిసారి చూసినప్పుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాను..
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ (The Rajasaab).

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ (The Rajasaab). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కామెడీ అండ్ హారర్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ (Teaser) రిలీజై.. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ వన్‌లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌పై హీరోయిన్ మాళవిక మోహనన్ స్పందిస్తూ ఓ పోస్ట్ పట్టింది.
‘‘ది రాజాసాబ్’ టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో ఉత్సాహంతో మేము ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము.. కాబట్టి నేను ముందుగా మీకు ఒక విషయం చెబుతాను. నేను ప్రభాస్‌ను మా సినిమా సెట్‌లో మొదటిసారి చూశాను. ఆ క్షణం నాకు చాలా ప్రత్యేకమైన క్షణాలలో ఒకటిగా ఉండిపోయింది. నేను మరొక సినిమా షూటింగ్‌లో ఉన్నాను. ఆ టైమ్‌లో నాకు అసలు నిద్ర లేదు. బాగా అలసిపోయాను. కానీ అదే టైమ్‌లో మా సెట్‌లో ప్రభాస్‌ను చూసేసరికి ఒక్కసారిగా మేల్కొన్నాను. అతను చాలా ఆకర్షణీయమైనవాడు, అందరిని హార్ట్‌ఫుల్‌గా స్వాగతించేవాడు & నేను అతనితో పాటు మాట్లాడినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది’ అని తెలిపింది.






