Malavika Mohanan : నాకు ఇష్టం లేదు.. కానీ షేర్ చేస్తున్నా అంటూ స్టార్ హీరోతో ఉన్న ఫొటో పంచుకున్న హీరోయిన్ (పోస్ట్)

by Chukka Sudharani |

మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Malavika Mohanan : నాకు ఇష్టం లేదు.. కానీ షేర్ చేస్తున్నా అంటూ స్టార్ హీరోతో ఉన్న ఫొటో పంచుకున్న హీరోయిన్ (పోస్ట్)
X

దిశ, సినిమా: మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా కన్నడ, హిందీ, తమిళ్, తెలుగులో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాళవిక చేతిలో.. ‘ది రాజాసాబ్’, ‘సర్దార్-2’తో పాటు మాలయాళ చిత్రం ‘హృదయపూర్వం’ (Hridayapoorvam) కూడా ఉంది. మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్ (Mohanlal) సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతోంది. దీంతో ఎప్పటికప్పుడు షూటింట్ స్పార్ట్ నుంచి ఫొటోస్ తన ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ సందడి చేస్తుంది.

ఇందులో భాగంగానే తాజాగా ‘హృదయపూర్వం’ నుంచి మోహన్ లాల్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ‘‘హృదయపూర్వం’ బృందం నుండి మీ అందరికీ ప్రేమను పంపుతున్నాను.. చాలా కాలం అయింది.. మీ అందరికీ పెద్ద హాయ్ అండ్ హగ్ కూడా. మేము రెండు వారాల నుండి పూణేలో షూటింగ్ చేస్తున్నాము. అందుకే చాలా బిజీగా ఉన్నాము అయినప్పటికీ ఆ టైమ్ ఎంతో సరదాగా గడిచింది. P.S ఈ ట్రెండ్‌లోకి వెళ్లడం అంత ఇంట్రెస్ట్ లేదు.. అందుకే ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ ఫోటో మాత్రం చాలా అందంగా ఉంది’ అంటూ మోహన్ లాల్‌తో ఉన్న ఫొటో షేర్ చేసింది.

Next Story