Aadi Sai Kumar: ‘శంబాల’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. అంచనాలు పెంచేస్తున్న మేకింగ్ వీడియో

by sudharani |
Aadi Sai Kumar: ‘శంబాల’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. అంచనాలు పెంచేస్తున్న మేకింగ్ వీడియో
X

దిశ, సినిమా: యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శంబాల’ (Shambala). షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ-యాడ్ ఇన్‌ఫినిటిమ్' ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని (Yugandhar Muni) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆది సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న దర్శకనిర్మాతలు.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘శంబాల’ మేకింగ్ వీడియో (Making video) వదిలారు మేకర్స్.

టీజర్ (Teaser) లోడింగ్ అంటూ వదిలిన ఈ వీడియోలో సినిమా కోసం చిత్రయూనిట్ ఏ రేంజ్‌లో కష్టపడుతోందో చూపిస్తూ ఆసక్తిరేకెత్తించారు. తాజాగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలకు మరింత పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌(Geoscientist)గా కనిపించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌(Indian silver screen)పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తుండటంతో సినీ ప్రేమికులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ సహా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతామని చిత్రయూనిట్ చెబుతోంది.

Next Story

Most Viewed