- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బాహుబలి’ రూ. 200 కోట్ల బడ్జెట్‌తో చేయడం ఫెయిల్యూర్ ప్లాన్‌లా అనిపించింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్
కేవలం ఒక ప్రాంతీయ తెలుగు చిత్రం కోసం అప్పట్లోనే సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. వ్యాపార వ్యూహాత్మకంగా ఆలోచిస్తే.. ఆ బడ్జెట్ నేరుగా ఫ్లాప్‌కు దారితీసే ఒక ప్రమాదకరమైన మార్గంలా కనిపించింది

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ఇక ఆమె కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ చిత్రం విడుదలై ఇన్నేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏదో ఒక ఆసక్తికర విషయం నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా తమన్నా ‘బాహుబలి’ బడ్జెట్, ఆ సినిమా నిర్మాణ సమయంలో ఉన్న పరిస్థితుల గురించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే 'బాహుబలి' కోసం తీసుకున్న ప్రతీ నిర్ణయం ఎంతో అద్భుతమైనదిగా, మంచి నిర్ణయంగానే కనిపిస్తుంది. కానీ, ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు, పరిస్థితులు వేరుగా ఉండేవి.
కేవలం ఒక ప్రాంతీయ తెలుగు చిత్రం కోసం అప్పట్లోనే సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. వ్యాపార వ్యూహాత్మకంగా ఆలోచిస్తే.. ఆ బడ్జెట్ నేరుగా ఫ్లాప్‌కు దారితీసే ఒక ప్రమాదకరమైన మార్గంలా కనిపించింది" అని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే సృజనాత్మక వ్యాపారాలు సాధారణ బిజినెస్ సూత్రాలలా పనిచేయవని తమన్నా అభిప్రాయపడింది. "మిగతా ప్రపంచంతో ఇతరులు అది తప్పో అస్సలు సంబంధం లేదు. ఒక వ్యక్తి తన విజన్‌ను గట్టిగా నమ్మితే చాలు, ఎలాంటి అద్భుతాలనైనా సృష్టించవచ్చు. రాజమౌళి గారు తన విజన్‌ను నమ్మారు కాబట్టే బాహుబలి సాధ్యమైంది. ఇక సినీ పరిశ్రమకు చెందని ఒక సాదాసీదా వ్యక్తిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు.. ఇక్కడ మనకు లభిస్తున్న అవకాశాన్ని సాధ్యమైనంత ఉత్తమమైనదిగా ఎలా మలచుకోవాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం" అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






