‘ఘాటి’ నుంచి ట్రైలర్ రాబోతుందంటూ అనుష్క పవర్‌ఫుల్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్.. లేడీ ఓజీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-12 04:20:21  IST  )

అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రజెంట్ నటిస్తున్న సినిమా ‘ఘాటి’(Ghati).

‘ఘాటి’ నుంచి ట్రైలర్ రాబోతుందంటూ అనుష్క పవర్‌ఫుల్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్.. లేడీ ఓజీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రజెంట్ నటిస్తున్న సినిమా ‘ఘాటి’(Ghati). క్రిష్‌ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఉత్తరాంధ్ర గంజాయి తోటల నేపథ్యంలో సాగే విభిన్న కథాచిత్రమని తెలుస్తున్నది. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఇందులో తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు(Vikram Prabhu) కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే లేడీ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో అనుష్క పాత్ర ఊహలకు అతీతంగా ఉంటుందని సమాచారం.

కాగా ఈ చిత్రం జులై 11న రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్‌గా చిత్రబృదం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మూవీ టీమ్ ఈ మూవీ రిలీజ్ కావడానికి 30 రోజులు మాత్రమే ఉన్నదని తెలియజేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘కౌంట్‌డౌన్ ప్రారంభమైంది, త్వరలో మా ఆల్బమ్ మరియు ట్రైలర్‌ను మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.. జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ఘాటీ గ్రాండ్ రిలీజ్ కానుంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పవర్‌ఫుల్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు లేడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story