స్పిరిట్ విషయంలో డైరెక్టర్ ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడా?

by Naga Rani Yarlagadda |

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఒక అలవాటు ఉంది. తాను ఏ సినిమా తీసినా అందులో ఉండే హీరో లుక్ లోనే కనిపిస్తుంటాడు.

స్పిరిట్ విషయంలో డైరెక్టర్ ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా స్పిరిట్. ఈ సినిమా షూటింగ్ అయితే వేగంగానే జరుగుతోంది కానీ.. అప్డేట్స్ ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇంత వరకూ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేయకపోవడంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే.. సందీప్ కు ఒక అలవాటు ఉంది. తాను ఏ సినిమా తీసినా అందులో ఉండే హీరో లుక్ లోనే కనిపిస్తుంటాడు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల సమయంలో ఆయన లుక్స్ ను గమనించిన వారికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది.

ఇప్పుడు స్పిరిట్ సినిమా చేస్తుండగా.. సందీప్ ప్రెజెంట్ లుక్ ఎలా ఉందో.. ప్రభాస్ లుక్ కూడా సినిమాలో అలాగే ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. కాగా.. యానిమల్ సినిమాలో రణబీర్ ఫస్ట్ లుక్ ను న్యూ ఇయర్ నైట్ విడుదల చేసి సంచలనం సృష్టించిన సందీప్.. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతారని తెలుస్తోంది. న్యూ ఇయర్ నైట్ కే స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తారని సమాచారం. దానితోపాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయట. మరి అంచనాలకు తగ్గట్టే న్యూ ఇయర్ నైట్ సందీప్ రెడ్డి వంగా.. డార్లింగ్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాలి.

Next Story