'టాక్సిక్' కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్.. అంచనాలు పెంచే ప్రయత్నం

by Pulgam srinivas |

టాక్సిక్ మూవీ బృందం మరికొన్ని రోజుల్లో మరో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు, అందులో కియారా అద్వానీ హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

టాక్సిక్ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్.. అంచనాలు పెంచే ప్రయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ హీరో యష్ తాజాగా టాక్సిక్ అనే చిత్రంలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. అందుకు అనుగుణంగా కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత సడన్‌గా ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేశారు. ప్రస్తుతం జూన్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి ఇప్పటికే మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటితో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఆ అంచనాలు మరింత పెంచే ప్లాన్ ఒకటి మేకర్స్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీలోపు మరో టీజర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఆ టీజర్‌లో యష్ తో పాటు ఈ సినిమా హీరోయిన్ కియారా అద్వానీ కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ గనుక ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, టోవినో థామస్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారి, డారెల్ డిసిల్వా, నటాలి బర్న్, కైల్ పాల్, బాలాజీ మనోహర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు యష్ సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Next Story