సుమంత్ ‘మహేంద్ర గిరి వారాహి’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-27 10:43:02  IST  )

ఈ మిస్టిక్ థ్రిల్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.

సుమంత్ ‘మహేంద్ర గిరి వారాహి’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
X

దిశ, సినిమా: గత ఏడాది ‘అనగనగా’ మూవీతో హిట్ అందుకున్న సుమంత్ అదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఆధ్యాత్మిక అంశాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు సంతోష్ జాగర్లపూడితో కలిసి ఆయన చేస్తున్న లేటెస్ట్ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘మహేంద్ర గిరి వారాహి’. భక్తి, సైన్స్, మైథాలజీ, మిస్టరీల కలబోతగా రూపొందుతున్న ఈ ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్‌ను రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మిస్టిక్ థ్రిల్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. సుమంత్ కెరీర్‌లోనే ఎంతో భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సంచలనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Next Story