‘ప్రతి వ్యాయామాన్ని ఫ్యాషన్‌గా చేయండి’.. విజయ్ దేవరకొండ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by I. Sairam |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

‘ప్రతి వ్యాయామాన్ని ఫ్యాషన్‌గా చేయండి’.. విజయ్ దేవరకొండ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా అనన్య పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పర్పుల్ కలర్ జిమ్ వేర్‌లో దర్శనమిచ్చింది. అలాగే కొన్ని క్యూట్ స్మైల్‌తో ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. ‘స్కెచర్స్ నుండి వచ్చిన ఈ బాంబ్ దుస్తులలో ప్రశాంతంగా ఉండలేక పోతున్నాను.. ప్రతి వ్యాయామాన్ని ఫ్యాషన్‌గా చేయండి’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ అవుట్ ఫిట్‌లో గార్జియస్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story