హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం !

by velandi.Saikiran |   (  Updated:2025-06-11 17:00:56  IST  )

హీరో నిఖిల్ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగింది. ది ఇండియన్ హౌస్ సినిమా

హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం !
X

దిశ, వెబ్ డెస్క్: హీరో నిఖిల్ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగింది. ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగింది. ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోయింది. దింతో లొకేషన్ మొత్తం వరద మాయం అయింది. అటు ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరా మెన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

మరికొంత మందికి గాయాలు అయ్యాయి. అటు ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో తీవ్ర నష్టం కూడా జరిగింది. శంషాబాద్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా... హీరో నిఖిల్.. ప్రస్తుతం చేస్తున్న సినిమా ది ఇండియా హౌజ్. ఈ సినిమాను రామ్ వంశీకృష్ణ.. చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు రైటర్లుగా వర్మ K సిద్ధార్థ అలాగే రామ్ వంశీకృష్ణ పనిచేస్తున్నారు. ఇందులో హీరో నిఖిల్ తో పాటు అనుపంకేర్, కైల్ పాల్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా... ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా వచ్చే ఏడాది లేదా ఈ సంవత్సరం చివరలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story