- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Vitta: క్యాస్ట్ కారణంగా ఇండస్ట్రీలో అలాంటి సమస్య ఎదుర్కొన్నాను
మహేష్ విట్టా మాట్లాడుతూ… కొన్ని సందర్భాల్లో తన కాస్ట్ కారణంగా కూడా సినిమా అవకాశాలు కోల్పోయినట్లు వెల్లడించాడు.

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబ్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం మంచి కమెడియన్‌గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో మహేష్ విట్టా ఒకరు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌లో ఎదురైన ఎత్తుపల్లాలను వివరించారు. మహేష్ విట్టా మాట్లాడుతూ… సినిమా పరిశ్రమలోకి కొత్తగా వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయాలనుకున్నాను. ఆ ఉద్దేశంతో 2016లో తేజ గారి ఆఫీస్‌కి వెళ్లి ఆయనను కలిశాను. ఆ సమయంలో ఆయన దర్శకత్వం కంటే నటనపై దృష్టి పెట్టాలని, ఆ మార్గంలో సులభంగా మంచి ఆదాయం పొందవచ్చని సలహా ఇచ్చారు. ఆయన సూచనతోనే నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నించడం ప్రారంభించాను.
ఆ తర్వాత విస్తృతంగా ప్రయత్నాలు చేయడంతో కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కాయి. కొన్ని సందర్భాల్లో పారితోషకం గురించి మాట్లాడకుండానే సినిమాలు చేశాను. మరికొన్ని సందర్భాల్లో కొందరు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక కాస్ట్ కారణంగా కూడా కొన్ని అవకాశాలు కోల్పోయాను. ఆడిషన్స్ చేసి, పాత్రకు ఎంపికై, డేట్లు కూడా ఫిక్స్ చేసిన తర్వాత చివరి నిమిషంలో నన్ను తప్పించి వేరే వారిని తీసుకునేవారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాకపోయేది. తరువాత ఇతరులతో మాట్లాడినప్పుడు, వాళ్లకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని తెలిసింది. అప్పుడే కాస్ట్ కారణంగానే కొన్ని అవకాశాలు దూరమయ్యాయని గ్రహించాను. మొత్తంగా తన సినిమా ప్రయాణంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానని మహేష్ విట్టా చెప్పుకొచ్చారు.






