నవంబర్ వచ్చేసింది అప్డేట్ ఎక్కడ.. #SSMB 29 అప్డేట్ పై మహేశ్ జక్కన్న వరుస ట్వీట్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-02 06:10:56  IST  )

మ‌హేశ్ బాబు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. అయితే న‌వంబ‌ర్‌లో ఈ సినిమా నుండి అప్డేట్ ఇస్తామని గతంలో రాజమౌళి ప్రకటించారు. దీంతో నవంబర్ వచ్చేసింది అప్డేట్ ఎక్కడ అంటూ మహేశ్ బాబు ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేశారు.

నవంబర్ వచ్చేసింది అప్డేట్ ఎక్కడ.. #SSMB 29 అప్డేట్ పై మహేశ్ జక్కన్న వరుస ట్వీట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: మ‌హేశ్ బాబు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. అయితే న‌వంబ‌ర్‌లో ఈ సినిమా నుండి అప్డేట్ ఇస్తామని గతంలో రాజమౌళి ప్రకటించారు. దీంతో నవంబర్ వచ్చేసింది అప్డేట్ ఎక్కడ అంటూ మహేశ్ బాబు ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నవంబర్ వచ్చేసింది అప్డేట్ ఎక్కడ అని మహేశ్ అడగ్గా.. అవును ఈ నెలలో ఏ సినిమాకు రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్ అంటూ జక్కన్న సెటైర్లు వేశారు. దీంతో మహేశ్.. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా సార్. నవంబర్ లో అప్డేట్ ఇస్తామన్నారు మాట నిలబెట్టుకోండి అంటూ కౌంటర్ వేశాడు.

తరవాత జక్కన్న ఇప్పుడే కదా మొదలైంది. ఒకదాని తరవాత ఒకటి నెమ్మదిగా ఇద్దామని సమాధానం ఇచ్చాడు. దానికి మ‌హేశ్.. ఎంత నెమ్మ‌దిగా సార్. 2030లో మొద‌లు పెడ‌దామా? దేశీ గ‌ర్ల్ ప్రియాంక ఇప్ప‌టికే హైద‌రాబాద్ వీధుల్లో రీల్స్ చేస్తోంద‌ని పేర్కొన్నారు. దీనికి ప్రియాంక స‌మాధానం ఇస్తూ.. హ‌లో హీరో సెట్స్ లో మీరు చెప్పే విష‌యాల‌న్నీ నేను లీక్ చేయ‌నా? మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వేసేస్తాన‌ని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. త‌ర‌వాత జ‌క్క‌న్న‌.. మ‌హేశ్.. ప్రియాంక చోప్రా ఉంద‌నే సంగ‌తి ఎందుకు చెప్పావ్. నువ్వు స‌ర్ ప్రైజ్ మిస్ చేశావ్ అంటూ ప్ర‌శ్నించాడు.

దీంతో మ‌హేశ్.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఉన్నారనే విషయాన్నీ దాచాలనుకున్నారా? అంటూ ప్ర‌శ్నించాడు. దానికి పృథ్వీరాజ్ సుకుమార‌న్ స్పందిస్తూ.. రాజ‌మౌళి సార్ నేను వెకేష‌న్ కు హైద‌రాబాద్ వ‌స్తుంటే నా కుటుంబం అనుమానిస్తోంది అంటూ న‌వ్వుతూ కామెంట్ చేశాడు. త‌ర‌వాత రాజ‌మౌళి.. మ‌హేశ్ నువ్వు అన్ని స‌ర్ ప్రైజ్ లు బ‌య‌ట‌పెట్టావ్ కాబ‌ట్టి నీ ఫ‌స్ట్ లుక్ వాయిదా వేయాల‌నుకుంటున్నా అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ప్రియాంక బెట‌ర్ ల‌క్ నెక్స్ట్ టైమ్ మ‌హేశ్ అని సెటైర్ వేయ‌గా.. ది బెస్ట్ ని జ‌క్క‌న్న చివ‌ర‌లోనే చూపిస్తారు... అంటూ ఆన్స‌ర్ ఇచ్చాడు. ఇలా వ‌రుస ట్వీట్ల‌తో SSMB 29 న‌టీన‌టులు, జ‌క్క‌న్న కాసేపు ట్విట్ట‌ర్ లో ర‌చ్చ లేపేశారు.





Next Story