సరికొత్త రికార్డు సృష్టించిన మహేష్ బాబు ‘ఖ‌లేజా’

by Gantepaka Srikanth |

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) - మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా చిత్రాన్ని రీరిలీజ్(Khaleja Re-Release) చేస్తున్న విషయం తెలిసిందే.

సరికొత్త రికార్డు సృష్టించిన మహేష్ బాబు ‘ఖ‌లేజా’
X

దిశ, వెబ్‌డెస్క్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) - మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా చిత్రాన్ని రీరిలీజ్(Khaleja Re-Release) చేస్తున్న విషయం తెలిసిందే. 2010లో విడుద‌లైన ఈ చిత్రానికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నా.. క‌మర్షియ‌ల్‌గా హిట్ కాలేక‌పోయింది. తాజాగా ఈ మూవీని మే 30న గ్రాండ్‌గా రీరిలీజ్‌ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేయగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడైపోతున్నాయి. అన్ని ఏరియాల్లో ఊహించిన దానిక‌న్నా ఎక్కువ‌ క్రేజ్ క‌నిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు విడుదలైన అన్ని రీరిలీజ్ సినిమాల్లో ఖలేజా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్‌కి మ‌రో మూడు రోజుల స‌మ‌యం ఉన్నా కూడా ఈ మూవీ సిటీలో రూ.1 కోటి గ్రాస్‌ను దాటి పోయినట్లు తెలుస్తోంది. ఈ కలెక్షన్స్ రిలీజ్ నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన అనుష్క(Anushka Shetty) హీరోయిన్‌గా నటించింది. బ్రహ్మానందం, అలీ, సునీల్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.

Next Story