Mahesh Babu: మహేశ్ బాబు ఫ్యాన్స్‌కుగుడ్ న్యూస్.. రీరిలీజ్‌కు సిద్ధమైన బిజినెస్‌మ్యాన్

by Chukka Sudharani |

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ‘బిజినెస్‌మ్యాన్’ ఒకటి.

Mahesh Babu: మహేశ్ బాబు ఫ్యాన్స్‌కుగుడ్ న్యూస్.. రీరిలీజ్‌కు సిద్ధమైన బిజినెస్‌మ్యాన్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ‘బిజినెస్‌మ్యాన్’ ఒకటి. 2012లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ మూవీని డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఎస్‌ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు. అప్పట్లో ఈ సినిమాలో సాంగ్స్ సెన్సేషన్ సృష్టించాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం మరోసారి ఫ్యాన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదలైన పోస్టర్‌లో మహేష్ బాబు ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తూ, బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సింహం ‘సూర్య భాయ్’ పవర్‌కి సింబల్‌గా నిలిచింది.

ఇక ఈ పోస్టర్‌పై పోస్టర్‌పై ‘సూర్యభాయ్ రోర్ తిరిగి రాబోతున్నది.. ఈ నవంబర్ 29న థియేటర్‌లలో సందడి చేయనుంది’ అంటూ నవంబర్ 29న రాబోతున్నట్లు ప్రకటించారు. కాగా.. నిర్మాత డా. వెంకట్ ఆధ్వర్యంలోని RR మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత విలువైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించారు. ఖలేజా రీ-రిలీజ్ విజయంతో ఉత్సాహం నింపుకున్న మెగా ప్రొడక్షన్స్.. ఈసారి మరింత విస్తృతంగా స్క్రీన్లు పెంచి సూర్య భాయ్ గర్జనను దేశమంతా వినిపించడానికి సిద్ధమవుతున్నారు. ఇక మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో “బిజినెస్‌మ్యాన్” మరోసారి థియేటర్లలో గర్జించనుండగా మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story