ఇప్పుడు నా కూతురు టీనేజర్.. సితార పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఫొటో షేర్ చేసిన మహేష్ బాబు..

by Sujitha Rachapalli |

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార పదమూడో పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఘట్టమనేని కుటుంబ అభిమానులు సోషల్ మీడియాను విషెస్‌తో ముంచెత్తారు. సితార పాపను ట్రెండ్ చేస్తున్నారు.

ఇప్పుడు నా కూతురు టీనేజర్.. సితార పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఫొటో షేర్ చేసిన మహేష్ బాబు..
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార పదమూడో పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఘట్టమనేని కుటుంబ అభిమానులు సోషల్ మీడియాను విషెస్‌తో ముంచెత్తారు. సితార పాపను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టాడు. ‘అండ్ జస్ట్ లైక్ దట్.. షీ ఈజ్ ఏ టీనేజర్..హ్యాపీ బర్త్ డే సితార.. నా లైఫ్‌ను ఎప్పుడూ వెలుగులతో నింపేయాలి.. లవ్ యూ సో మచ్’ అంటూ కూతురిని గారాబం చేస్తున్న ఫొటో పోస్ట్ చేశాడు.

కాగా దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. విషింగ్ లిటిల్ ఏంజిల్ సితార అంటూ మురిసిపోతున్నారు. ‘టీనేజ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి’, ‘గర్ల్స్ ఫస్ట్ ట్రూ లవ్ ఫాదర్.. కంగ్రాట్యులేషన్స్’ ‘గొప్ప హీరోయిన్‌గా ఎదగాలని కోరుకుంటున్నాం’, ‘తండ్రికి తగిన కూతురు అనిపించుకోవాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మహేష్ సితారకు అన్న లాగా కనిపిస్తున్నాడని అంటున్నారు.

LINK

Next Story