మహేష్ బాబు ఆ హీరోయిన్‌ను లాగి హగ్‌ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టుకోవాలనుకున్నాడా?

by Disha Web Desk 6 |
మహేష్ బాబు ఆ హీరోయిన్‌ను లాగి హగ్‌ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టుకోవాలనుకున్నాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించారు. హీరోగా మాత్రం ‘రాజకుమారుడు’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు స్టార్ హీరోయిన్ ని చూసి అట్రాక్ట్ అయ్యారని ఆమెను ముద్దు కూడా పెట్టుకోవాలని అనుకున్నారని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. మహేష్ బాబు- ప్రీతిజింతా కాంబినేషన్‌లో తెరరకెక్కిన సినిమా రాజకుమారుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఆయన లుక్స్‌కి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు.

ఆయనకి ఇది ఫస్ట్ సినిమా కావడం పైగా హీరోయిన్ తో అలా ఫస్ట్ టైం రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఉండడంతో మహేష్ బాబు అట్రాక్ట్ అయిపోయారట. షూట్ కంప్లీట్ అయ్యాక తన ఫ్రెండ్స్‌తో సరదాగా మాట్లాడుతున్నప్పుడు వాళ్లు ప్రీతీ జింటాను చూడగానే ఏమనిపించిందని మహేష్ బాబును అడిగారట. అప్పుడు టీనేజ్‌లో ఉన్న సూపర్ స్టార్ ఆమెను ఫస్ట్ టైమ్ చూడగానే అట్రాక్ట్ అయిపోయా.. గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది అని చెప్పారట. అయితే అది మొత్తం కేవలం అట్రాక్షన్ అని నమ్రతను చూసిన తర్వాత ఒరిజినల్ ప్రేమ తెలిసిందని మహేష్ బాబు ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Next Story

Most Viewed