War - 2 : వార్-2 లో ప్రిన్స్ మహేష్ బాబు?

by Muthe.Rajitha |

మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘వార్ 2’ (War 2) కూడా ఒకటి. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

War - 2 : వార్-2 లో ప్రిన్స్ మహేష్ బాబు?
X

దిశ, వెబ్ డెస్క్ : మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘వార్ 2’ (War 2) కూడా ఒకటి. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హైప్ ఈ రేంజ్ లో పెరగడానికి ముఖ్య కారణం హృతిక్ రోషన్ (Hrithik Roshan) – జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) కాంబో. ‘వార్ 2’తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుండడం ప్రాజెక్ట్ పై భారీగా హైప్ క్రియేట్ చేసింది. అంతకాదు ఈ సినిమాలో జాన్ అబ్రహం(John Abraham), కియారా అద్వానీ(Kiara Adwani) కూడా ఉండటంతో ప్రేక్షకుల అంచనాలు ఎక్కడికో పోయాయి. తాజాగా ఈ మూవీలో మరో స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) కూడా భాగం కాబోతున్నారనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్న న్యూస్ హాల్ చల్ చేస్తోంది. ఆగస్ట్ 15, 2025 న పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల కాబోతున్న ఈ చిత్రం షూటింగ్ తోపాటు, మిగతా పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. అయితే ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనుండగా.. హిందీ వెర్షన్ కు రణబీర్ కపూర్(Ranbeer Kapoor) ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) లో ఆదిత్య చోప్రా(Aditya Chopra) నిర్మాతగా.. ప్రముఖ హిందీ ఫిల్మ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukharji) రూపొందిస్తున్న ఈ మూవీ.. 2019లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ వార్(War) కు ఇది సీక్వెల్. అయితే ఇదివరకే మహేష్ బాబు జూ. ఎన్టీఆర్ బాద్షా(Badshah)కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Next Story