- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Varanasi: రాముడి అవతారంలో మహేష్..రూ. 5000 కోట్లకు, ఒక్క రూపాయి తగ్గేదే లేదు!
మహేష్ బాబు, రాముని గెటప్ లో కనిపించాడు. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని, టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఇక ఆ తర్వాత సరికొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు కుర్ర హీరోలకు పోటీగా తన అందంతో నిలుస్తున్నాడు మహేష్ బాబు. దాదాపు 50 సంవత్సరాల వయసు ఉన్న మహేష్ బాబు, టీనేజ్ హీరో లాగా ఫిట్ గా కనిపిస్తాడు.
అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న ( S. S. Rajamouli) దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వారణాసి ( Varanasi ) అనే టైటిల్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఈవెంట్ నిర్వహించిన జక్కన్న, ఆ సందర్భంగా టైటిల్ టీజర్ ను వదిలారు. దీంతో ఈ సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో రాముడి గెటప్ తో పాటు రుద్ర పాత్రలో కనిపిస్తాడట మహేష్ బాబు. అయితే ఇప్పటికే రుద్ర పాత్రను రాజమౌళి రివీల్ చేశారు. కానీ రాముడి గెటప్ లో మహేష్ బాబు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు అభిమానులు ఏఐ టెక్నాలజీ వాడి, మహేష్ బాబు రాముడు గెటప్ లో ఉన్న వీడియోను వైరల్ చేశారు.
ఇందులో చూడ ముచ్చటగా మహేష్ బాబు, రాముని గెటప్ లో కనిపించాడు. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ సినిమా రూ. 5000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వారణాసి సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తుండగా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో మెరువనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్లతో ఈ సినిమా రూపొందే ఛాన్సులు కనిపిస్తున్నాయి. క్లిక్






