అప్డేట్ అన్నారుగా..ఇక‌పై చొక్కా తీసేసి వస్తా..మ‌హేష్ బాబు సూప‌ర్ స్పీచ్‌

by velandi.Saikiran |   (  Updated:2025-11-16 09:26:06  IST  )

ఈ వారణాసి ఫంక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సూప‌ర్ స్పీచ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా జ‌క్క‌న్న‌ను మెచ్చుకున్నారు.

అప్డేట్ అన్నారుగా..ఇక‌పై చొక్కా తీసేసి వస్తా..మ‌హేష్ బాబు సూప‌ర్ స్పీచ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా వ‌స్తున్న తాజా సినిమా వారణాసి. మ‌హేష్ బాబు హీరోగా, ప్రియంక చోప్రా హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకు జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఈ మూవీని వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కించారు జ‌క్క‌న్న‌. అయితే, తాజాగా వార‌ణాసి సినిమాను టైటిల్ టీజ‌ర్ ను రిలీజ్ చేశారు. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు.

ఇక ఈ వారణాసి ఫంక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సూప‌ర్ స్పీచ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా జ‌క్క‌న్న‌ను మెచ్చుకున్నారు. వార‌ణాసి సినిమాతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంద‌న్నారు. ఈ ఈవెంట్ కు న‌డుచుకుంటూ వ‌స్తాన‌ని చెప్పా, కానీ గాల్లోకి లేపార‌ని జ‌క్క‌న్న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. పూల చొక్కాతో వ‌స్తానంటే, గుండీలు లేని ష‌ర్ట్ ఇచ్చార‌న్నారు. ఫ్యాన్స్ కోసం ఎలాంటి గెట‌ప్ వేయడానికైనా రెడీ అంటూ మ‌హేష్ బాబు తెలిపారు. ఈ సినిమా కోసం ష‌ర్ట్ విప్పాల్సి వ‌స్తుందేమో అంటూ ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. దానికి కూడా నేను రెడీ అన్నారు. జ‌క్క‌న్నతో పాటు ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తాన‌న్నారు మ‌హేష్ బాబు. క్లిక్

READ MORE ....

‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్.. అందరినీ గర్వపడేలా చేస్తాను: మహేష్ బాబ

Next Story