మహేష్ బాబు మరదలికి చేదు అనుభవం.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-08-14 08:06:05  IST  )

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్(Mahesh Babu) బాబు మ‌ర‌ద‌లు, బాలీవుడ్ యాక్టర్ శిల్పా శిరోద్కర్‌(Shilpa Shirodkar)కు చేదు అనుభవం ఎదురైంది.

మహేష్ బాబు మరదలికి చేదు అనుభవం.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్(Mahesh Babu) బాబు మ‌ర‌ద‌లు, బాలీవుడ్ యాక్టర్ శిల్పా శిరోద్కర్‌(Shilpa Shirodkar)కు చేదు అనుభవం ఎదరైంది. ఆమె కారుని ఒక బ‌స్సు ఢీకొట్టింది. దీంతో ఈ సంఘ‌ట‌న‌పై త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ బస్సు రవాణా సంస్థపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ శిల్పా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ స్టోరీ పెట్టింది. ‘ఈ రోజు నా కారును సిటీ ఫ్లో అనే కంపెనీకి చెందిన‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనకి సంబంధించి సంస్థకు చెందిన యోగేష్ కదమ్, విలాస్ మంకోటే అనే ప్రతినిధులను సంప్రదించగా అది తమ కంపెనీ బాధ్యత కాదని, డ్రైవర్‌దే పూర్తి బాధ్యత అని వెల్ల‌డించారు.

వీళ్లు త‌మ కంపెనీ ఉద్యోగుల ప‌ట్ల‌ ఎంత కఠినంగా ఉన్నారు. ఒక డ్రైవర్ నెల‌కు ఎంత సంపాదిస్తాడు? అత‌డు ఈ డ్యామేజ్‌ని ఎలా క‌డ‌తాడు అంటూ శిల్పా శిరోద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడి దయ వల్ల నా సిబ్బందికి ఏం కాలేదు. ఈ ఘ‌ట‌న‌పై కంప్లయింట్ తీసుకోవ‌డానికి స‌హ‌క‌రించిన ముంబై పోలీసులకు ధన్యవాదాలు. కానీ కంపెనీ మాత్రం ఎలాంటి బాధ్య‌త‌ను తీసుకోవడానికి నిరాకరిస్తోంది’ అంటూ శిల్పా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Also Read..

చరణ్ నెంబర్‌ను ఉపాసన ఏమని సేవ్ చేసుకుందో తెలుసా..? అస్సలు ఊహించి ఉండలేరుగా..!

Next Story