SSMB-29: మహేష్ బాబు-రాజమౌళి మూవీలో ప్రియాంక చోప్రా.. పోస్ట్‌తో హింట్ ఇచ్చేసిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2025-01-18 13:01:51  IST  )

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబోలో SSMB-29 సినిమా రాబోతుంది.

SSMB-29: మహేష్ బాబు-రాజమౌళి మూవీలో ప్రియాంక చోప్రా.. పోస్ట్‌తో  హింట్ ఇచ్చేసిందిగా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబోలో SSMB-29 సినిమా రాబోతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) కథ అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అంతా ఆసక్తిగా ఉన్నారు. అయితే ‘SSMB-29’ కోసం రాజమౌళి పలు ప్రదేశాలు కూడా వెతికే పనిలో పడ్డారు. ఇక మహేష్ బాబు మాత్రం సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ పూర్తిగా SSMB కోసం పలు విద్యలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, ఈ అమ్మడు టొరంటో నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు SSMB కోసమే వచ్చిందని చర్చించుకుంటున్నారు. అందుకోసమే హైదరాబాద్ వచ్చినట్లు పోస్ట్‌తో హింట్ ఇచ్చిందని అంటున్నారు. నిక్ జోనస్‌తో పెళ్లి తర్వాత హాలీవుడ్‌కే పరిమితం అయిన ప్రియాంక ఇప్పుడు తెలుగు సినిమా చేస్తుందనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


Next Story