ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్న మహేశ్ బాబు - రాజమౌళి.. వీడియో షేర్ చేసిన RGV

by Ramesh Naini |   (  Updated:2026-02-24 14:30:15  IST  )

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకరినొకరు పిడిగుద్దులతో కొట్టుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్న మహేశ్ బాబు - రాజమౌళి.. వీడియో షేర్ చేసిన RGV
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకరినొకరు పిడిగుద్దులతో కొట్టుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఇది నిజమైన గొడవ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన ఒక కల్పిత వీడియో. ఈ వీడియోపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. ‘సినిమా ఈజ్ డెడ్’ (సినిమా చచ్చిపోయింది) అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'వారణాసి' (Varanasi) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఒక వీడియోను సృష్టించారు. అందులో మహేశ్ బాబు, రాజమౌళి ఒకరిపై ఒకరు పంచ్‌లు కురిపించుకుంటూ, టేబుళ్లు, గోడలకు కేసి కొట్టుకుంటూ కనిపించారు. ఎటువంటి కథా సందర్భం లేకుండా కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం రూపొందించిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వర్మ ఆవేదన.. నెట్టింట చర్చ..

ఈ వీడియోను షేర్ చేసిన వర్మ, ఏఐ వల్ల భవిష్యత్తులో సినిమా రంగం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందనే అర్థంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు ఈ వీడియోలోని సాంకేతిక నైపుణ్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు సినిమా ప్రముఖుల మధ్య ఇలాంటి హింసాత్మకమైన వీడియోలను సృష్టించడం తప్పు అని నెటిజన్‌లు వాదిస్తున్నారు. కొంత మంది ఫ్యూచర్‌లో నటులతో పని లేదని ఏఐతోనే పూర్తి స్థాయి సినిమాలు తీయోచ్చనడానికి ఈ వీడియో ఉదాహరణ అని పలువురు నెటిజన్‌లు కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా, ఏఐ సాంకేతికత వినోదాన్ని పంచుతున్నప్పటికీ, అది సినిమా రంగానికి శాపంగా మారుతుందా..? అనే చర్చకు వర్మ ట్వీట్ వేదికైంది.

'వారణాసి' అప్‌డేట్స్..

మరోవైపు, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఇది వరకే చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవలే గుంటూరులోని మైత్రీ సినిమాస్ వద్ద మహేశ్ బాబు 'శ్రీరాముడి' అవతారంలో ఉన్న డిజిటల్ పోస్టర్ పెట్టడం లాంటివి అభిమానుల్లో సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.

Next Story