ఇలాంటి సినిమా జీవితంలో ఒకేసారి వస్తుంది.. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం

by Chukka Sudharani |

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా, ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘వారణాసి’.

ఇలాంటి సినిమా జీవితంలో ఒకేసారి వస్తుంది.. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం
X

దిశ, సినిమా: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా, ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘వారణాసి’. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తోన్న చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు గ్లోబ్ ట్రాట‌ర్‌ అంటూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రయూనిట్.. టైటిల్‌ను, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, టీజర్‌ (వారణాసి టు ది వరల్డ్)ను కూడా రిలీజ్ చేశారు.

ఈ ఈవెంట్‌లో మహేష్ బాబు మాట్లాడుతూ .. ‘మా నాన్న గారు చెప్పిన ప్రతీ మాటను నేను విన్నాను. ఒక్క మాట తప్పా. పౌరాణిక పాత్రలు పోషించమని చెప్పిన మాటను మాత్రం నేను వినలేదు. ఈ చిత్రంతో ఆ కోరిక కూడా నెరవేరింది. మా నాన్న గారు ఎక్కడున్నా కూడా ఈ రోజు నా మాటల్ని విని సంతోషిస్తారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోని ఉంటాయి. ‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అందరినీ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా నా దర్శకుడుని గర్వపడేలా చేస్తాను. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు మన భారతీయులంతా గర్వపడతారు. ఇది కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతోందో మీ ఊహకే వదిలేస్తున్నాను’ అన్నారు.

ద‌ర్శక‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ .. ‘నాకు రామాయణం, మహాభారతం అన్నా చాలా ఇష్టం. మహాభారతం తీయాలనేది నా డ్రీమ్ అని చాలా సార్లు చెప్పాను. ఈ మూవీని మొదలు పెట్టినప్పుడు రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. కానీ ఒక్కో సీన్ రాస్తుంటే.. ఒక్కో డైలాగ్ వస్తుంటే.. షాట్‌ని ఊహించుకుంటూ ఉంటే.. నేల మీద కాకుండా గాల్లో విహరిస్తున్నట్టుగా అనిపించింది. మహేష్ బాబుని రాముడి గెటప్‌లో ఫోటో షూట్ చేస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ ఫోటోని వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. ఎవరైనా చూస్తారేమో అని మళ్లీ తీసేశాను. ఇప్పటి వరకు 60 రోజుల పాటు షూట్ చేశాం. ప్రతీ పాయింట్‌లో సబ్ పాయింట్ ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. నేను ఇంత వరకు చేసిన చిత్రాలన్నింటిలోకెల్లా మెమరబుల్ సినిమాగా ‘వారణాసి’ నిలుస్తుంది’ అన్నారు.

Next Story