#GlobeTrotter: ప్లీజ్.. పాసులుంటేనే రండి: ఫ్యాన్స్‌కు మహేష్ రిక్వెస్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-14 13:08:30  IST  )

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా గ్లోబ్ ట్రోటర్.

#GlobeTrotter: ప్లీజ్.. పాసులుంటేనే రండి: ఫ్యాన్స్‌కు మహేష్ రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా గ్లోబ్ ట్రోటర్. మహేష్ బాబుకు ఇది 29వ సినిమా కాగా.. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి ఈవెంట్ ను నవంబర్ 15వ తేదీ సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మహేశ్ తన అభిమానులకు కీలక రిక్వెస్ట్ చేశారు.

దయచేసి పాస్ పోర్టులు (ఈవెంట్ పాస్) ఉంటేనే ఈ ఈవెంట్ కు రావాలని, పాస్ లు లేకుండా వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు. అలాగే రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుందని, పాస్ మీద ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గూగుల్ మ్యాప్ వస్తుందని, దానిప్రకారం బ్యాక్ గేట్ నుంచి లోపలికి రావాలని తెలిపారు. ఈ ఈవెంట్ కు పోలీసులు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారని, వారికి సహకరించాలని కోరారు. అలాగే వీలైనంత తక్కువ ట్రాన్స్ పోర్ట్ వాడాలని సూచించారు. సేఫ్ గా వచ్చి సేఫ్ గా వెళ్లండి.. రేపు ఈవెంట్ లో కలుద్దామంటూ మహేశ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. కాగా.. శనివారం సాయంత్రం జరిగే ఈ ఈవెంట్లో మహేశ్ లుక్, టైటిల్ తో పాటు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.

Next Story