- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Babu: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో మహేష్ బాబు.. తన లుక్‌తో బిగ్ షాకిచ్చాడుగా! (వీడియో)
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన నటించిన ‘గుంటూరు కారం’(Guntur Kaaram) మూవీ గత ఏడాది విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ హిట్ అందుకోలేక బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB-29’ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం(John Abraham) కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ‘SSMB-29’ తెగ కష్టపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్న ఆయన తన మెకోవర్ కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, సోషల్ మీడియా ట్రెండింగ్ మహేష్ వీడియో ఉంది. ఇందులో ఆయన జుంపాల జుట్టు, గుబురు గడ్డంతో అద్దంలో చూసుకుంటూ కనిపించారు. అది చూసిన కొంతమంది నెటిజన్లు షాక్ అవుతుండగా.. మరికొందరు మాత్రం లుక్ అదిరిపోయిందంటే అని కామెంట్లు చేస్తున్నారు.
BOB Jr . 🔥🔥🔥
— Australian Telugu Films (@AuTelugu_Films) February 27, 2025
He is Coming....#SSMB29 #SSRajamouli #MaheshBabu pic.twitter.com/c205p0KUlB






