- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Babu: ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే..ఇక ముందు జాతరే
వారణాసి సినిమాతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కాబోతుంది అంటూ మహేష్ బాబు వెల్లడించారు

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు అలాగే జక్కన్న కాంబినేషన్ లో వారణాసి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరగగా, తాజాగా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించి టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం. వేలాది అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు హాట్ కామెంట్స్ చేశారు.
వారణాసి సినిమాతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కాబోతుంది అంటూ మహేష్ బాబు వెల్లడించారు. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ముందు ముందు జాతర అంటూ వ్యాఖ్యానించారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ఫ్యాన్స్ తో ముచ్చటించారు. పౌరాణికం చేయాలని నాన్న ఎన్నోసార్లు చెప్పేవారు… నేను మాత్రం వినలేదన్నారు. ఆయన మాటలు ఎప్పుడూ వినలేదు.. ఇప్పుడు ఆయన నా మాటలు వింటుంటారని తెలిపారు. వారణాసి విడుదలైన తరవాత దేశమంతా గర్వంగా ఫీలవుతుందని వ్యాఖ్యానించార మహేష్.
READ MORE ....






