- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా మహేంద్రగిరి వారాహి టీజర్..
వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రేక్షకులను అలరిస్తున్న అక్కినేని సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’.

దిశ, సినిమా: వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రేక్షకులను అలరిస్తున్న అక్కినేని సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం, అతీంద్రియ శక్తులు, కొన్ని రహస్య మరణాల చుట్టూ తిరిగే ఈ ప్రతిష్టాత్మక సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన టీజర్ ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. అక్కడ జరిగే కొన్ని అంతు చిక్కని సంఘటనలు, భూగర్భంలో దాగి ఉన్న రహస్యాలు, ప్రకృతి సృష్టించే వింతలు ఈ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతే కాకుండా ప్రతీ ఫ్రేమ్‌లో తెలియని ఒక గంభీరమైన వాతావరణాన్ని, హారర్ ఎలిమెంట్స్‌ను పర్‌ఫెక్ట్‌గా ఎలివేట్ చెయ్యగా.. విజువల్ వండర్‌గా విడుదలైన కొద్దినిమిషాలకే సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుని అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది టీజర్. కాగా.. దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.






