- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మహాకాళి'గా భూమి శెట్టి..ఫస్ట్ లుక్ అదుర్స్
ప్రశాంత వర్మ PVCU నుంచి మరో సినిమా రాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మహంకాళి

దిశ, వెబ్ డెస్క్ : ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ దర్శకుడిగా దూసుకు వెళ్తున్నారు. అయితే అలాంటి ప్రశాంత వర్మ PVCU నుంచి మరో సినిమా రాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మహంకాళి సినిమా వస్తోంది. తాజాగా ఈ మహంకాళి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇందులో మహంకాళి పాత్రలో కన్నడ బ్యూటీ భూమి శెట్టి నటించబోతున్నారు.
ఈ మేరకు భూమి శెట్టిని మహాగా పరిచయం చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్రం బృందం. కాగా ఈ బ్యూటీ షరతులు వర్తిస్తాయి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఇప్పుడు మహంకాళిగా అవతారం ఎత్తనుంది. ఈ సినిమాలో లేడీ సూపర్ హీరోగా భూమి శెట్టి కనిపించనున్నారు. ఈ సినిమాకు పూజ అపర్ణ దర్శకత్వం వహించబోతున్నారు. ఇది ఇలా ఉండగా PVCU లో భాగంగా ఇటీవల అధీర సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎస్ జె సూర్యతో పాటు కళ్యాణ్ దాసరి నటిస్తున్నారు.






