‘మ్యాజిక్ జరిగింది.. ప్రధాన షెడ్యూల్ ముగిసింది’.. ఆ సినిమాపై కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ట్వీట్..

by I. Sairam |   (  Updated:2025-12-09 15:47:59  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

‘మ్యాజిక్ జరిగింది.. ప్రధాన షెడ్యూల్ ముగిసింది’.. ఆ సినిమాపై కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘రాజావారు రాణిగారు’(Rajavaru Ranigaru) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత అతను నటించిన చిత్రాలన్నీ మంచి హిట్సే అయ్యాయి. ఇక రీసెంట్‌గా 'కె ర్యాంప్'(K-Ramp) అనే మూవీతో మన ముందుకు వచ్చిన కిరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

ఇందులో భాగంగా అతను ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో 'చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story) ఒకటి. 'బేబీ' ఫేమ్ సాయి రాజేష్(Sai Rajesh) కథ అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి(Ravi Namboori) దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకి కథ అందించడంతో పాటుగా ప్రొడ్యూసర్ SKNతో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో తెలుగమ్మాయి గౌరీ ప్రియ(Gouri Priya) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ మంచి టాక్ తెచ్చుకుంది.

దీంతో ఈ సినిమా నుంచి ఇంకా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న క్రమంలో కిరణ్ అబ్బవరం ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోయిన్ గౌరి ప్రియతో దిగిన క్యూట్ పిక్‌తో పాటు మూవీ టీమ్‌తో దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ఇక వాటికి ‘మ్యాజిక్ జరిగింది.. ప్రధాన షెడ్యూల్ ముగిసింది’ అనే క్యాప్షన్ జోడించాడు. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ మెయిన్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Click For Tweet .....

Next Story