మధురై సెంట్రల్.. ఖుష్బూ భర్త ఘోర ఓటమి

by velandi.Saikiran |

తమిళనాడు రాష్ట్రం మధురై సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ నేత ఖుష్బూ భర్త సుందర్ ఘోర ఓటమి పాలయ్యారు.

మధురై సెంట్రల్.. ఖుష్బూ భర్త ఘోర ఓటమి
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రం మధురై సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ నేత ఖుష్బూ భర్త సుందర్ ఘోర ఓటమి పాలయ్యారు. ఎన్డీఏలో భాగస్వామ్యమైన పుతియ నీది కచ్చి తరఫున పోటీ చేశాడు. ఈ క్రమంలో 33,538 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు ఖుష్బూ భర్త సుందర్. ఇక్కడ టీవీకే పార్టీ అభ్యర్థి మాధ‌ర్ బధురుద్దీన్ 19,128 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అటు రెండో స్థానంలో డీఎంకే అభ్యర్థి త్యాగ రాజన్ ఉండగా.. అతనికి 44,286 ఓట్లు పోల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా తమిళనాడు రాష్ట్రంలో హంగ్ ఏర్పడింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన TVK అధినేత విజయ్ ముఖ్యమంత్రి కానున్నారు. ఈ మేరకు భద్రత ఏర్పాట్లు కూడా విజయ్ ఇంటి దగ్గర ఏర్పాట్లు చేశారు పోలీసులు.

Next Story