సినిమా రివ్యూలను ఆపలేం: మద్రాసు హైకోర్టు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-26 20:18:02  IST  )

సినిమా విడుదల తర్వాత మూడు రోజులపాటు రివ్యూలను నిషేధించాలని కోరుతూ తమిళ నిర్మాతల సంఘం వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు (Madras High Court) తిరస్కరించింది.

సినిమా రివ్యూలను ఆపలేం: మద్రాసు హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా విడుదల తర్వాత మూడు రోజులపాటు రివ్యూలను నిషేధించాలని కోరుతూ తమిళ నిర్మాతల సంఘం వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు (Madras High Court) తిరస్కరించింది. భావప్రకటన స్వేచ్ఛను నెరవేర్చే హక్కుగా రివ్యూలను కొట్టిపారేయడం సరైంది కాదని, సోషల్ మీడియా యుగంలో అలాంటివి ఆపడం అసాధ్యమని కోర్టు స్పష్టం చేసింది.

జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ (Justice Anand Venkatesh) నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను గురువారం విచారించింది. రివ్యూలను పూర్తిగా నిరోధించడం సాధ్యపడదని, సినీ పరిశ్రమకు చెందినవారు ట్రోలింగ్ వంటి దుస్థితులను కూడా సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

సూర్య నటించిన ‘కంగువా’ సినిమాకు విమర్శలు ఎదురైన సమయంలో ఈ పిటిషన్ దాఖలైంది. అప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో నిర్మాతల సంఘం స్పందించి రివ్యూలపై తాత్కాలిక నిషేధాన్ని కోరింది.

ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇదే అంశంపై చర్చ సాగింది. సినిమా విడుదలైన వెంటనే రివ్యూలు రావడం వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు, కొంత గ్యాప్‌ ఇచ్చి పబ్లిక్ స్పందన తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, న్యాయపరంగా అలాంటి నిషేధం అమలు చేయడం సవాలుగా మారిన విషయం మరోసారి బయటపడింది.

Next Story