- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ-2 సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, సీనియర్ హీరో బాలకృష్ణల హిట్ కాంబోలో వస్తున్న అఖండ-2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, సీనియర్ హీరో బాలకృష్ణల హిట్ కాంబోలో వస్తున్న అఖండ-2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా మద్రాసు హైకోర్టు (Madras High Court) సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశించడంతో సినిమా ఆగిపోయింది. సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ.. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు బాకీ ఉన్న రూ.28 కోట్లు చెల్లించకపోవడం వల్ల అఖండ-2 రిలీజ్ (Akhanda-2 release)కు కష్టాలొచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు సంస్థలకు చెందిన కీలక నేతలు ఈ సమస్యపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం జరిగిన చర్చలు సఫలం కావడంతో అఖండ-2 రిలీజ్ కు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ (Eros International Company) అంగీకరించింది. ఈ మేరకు ఈ రోజు మద్రాసు హైకోర్టు విచారణ అనంతరం అఖండ-2 సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) నిన్న సాయంత్రం కీలక అప్ డేట్ ఇచ్చారు. అఖండ-2 ఇష్యూ క్లియర్ అయిందని, డిసెంబర్ 12న సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అఖండ 2 ఈ నెల 11 ప్రీమియర్ షోలు, 12న పూర్తి స్థాయిలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా మరికొద్ది సేపట్లో అఖండ-2 ను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.






