Hisaab Barabar: మాధవన్ ‘హిసాబ్ బరాబర్’ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

by Phanindra |   (  Updated:2025-08-03 15:10:16  IST  )

మాధవన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘హిసాబ్ బరాబర్’ త్వరలో ఓటీటీకి రానుంది.

Hisaab Barabar: మాధవన్ ‘హిసాబ్ బరాబర్’ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మాధవన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘హిసాబ్ బరాబర్’ త్వరలో ఓటీటీకి రానుంది. ఒక బ్యాంక్ చేసిన మోసం వలన రైల్వే TC గా వర్క్ చేసే మాధవన్ జీవితం ఎలా మరిందనే ఆసక్తికర కథతో ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా, ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ‘హిసాబ్ బరాబర్’ జీ5లో జ‌న‌వ‌రి 24 నుంచి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

హీరో ఆర్‌.మాధ‌వ‌న్ మాట్లాడుతూ "జీ5తో నేను చేసిన మొదటి సినిమా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీలో నేను కూడా ఒక భాగం అవ్వడమనేది యాక్ట‌ర్‌గా నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. సామాన్యుడైన రాధే మోహ‌న్ శ‌ర్మ పాత్ర‌లో న‌టించ‌టాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ పాత్ర నేను చేసేటప్పుడు ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. మ‌నలో ఉండే కామ‌న్ మ్యాన్ అవినీతిని ఎలా ఎదిరించిండనేదే క‌థ‌. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. ఇలాంటి వాస్త‌వ కథలతో సినిమాలు చాలా రావాలని కోరుకుంటున్నాను" అని ఆయన మాటల్లో తెలిపారు.

Next Story