'SSMB29' మరో స్టార్ నటుడు.. ఆసక్తికరంగా పోస్ట్

by Chukka Sudharani |

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

SSMB29 మరో స్టార్ నటుడు.. ఆసక్తికరంగా పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ‘SSMB29’ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో మలయాళ స్టార్ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మాధవన్ పాత్రపై చర్చలు జరపగా.. దాదాపు ఓకే అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో మాధవన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి ఉండాల్సి ఉంది.



Next Story