- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదం - ‘A’ సర్టిఫికెట్
నూతన సంవత్సరం కానుకగా ‘మదం’ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బలమైన ఎమోషన్స్‌తో సాగే ఈ హార్డ్-హిట్టింగ్ డ్రామా థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్యదేవర రవీంద్రనాథ్ (చినబాబు), రమేష్ బాబు కోయ ఈ చిత్రాన్ని

దిశ, సినిమా : నూతన సంవత్సరం కానుకగా ‘మదం’ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బలమైన ఎమోషన్స్‌తో సాగే ఈ హార్డ్-హిట్టింగ్ డ్రామా థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్యదేవర రవీంద్రనాథ్ (చినబాబు), రమేష్ బాబు కోయ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్ష గంగవరపు, ఇనాయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి ఇందులో కీలక పాత్రలు పోషించారు. రాజీ లేని కథనంతో, వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను రూపొందించినట్లు నిర్మాతలు తెలిపారు. సినిమాలోని ఇంటెన్స్ సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్ కారణంగా సెన్సార్ బోర్డు దీనికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. కథ, మాటలను నిర్మాత రమేష్ బాబు కోయ అందించగా, వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ‘ఈగల్’ ఫేమ్ డేవ్‌జాండ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. నందమూరి తారకరామారావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. రవి వి సినిమాటోగ్రఫీ అందించారు.






