సినిమా థియేటర్‌లో లవర్‌తో హద్దులు మీరిన ప్రియుడు.. పోర్న్ సైట్‌లో వీడియోలు ప్రత్యక్షం

by Sujitha Rachapalli |

సాధారణంగా ప్రేమికులు అంటేనే సినిమాలు, షికార్లు. కార్నర్ సీట్‌ తీసుకుని ఎంజాయ్ చేయడం. మూడు ముద్దులు, నాలుగు హగ్గులతో ఎంతో కొంత ప్రైవసీగా ఉండటం.. దాదాపు లవర్స్ అంతా చేసే పని ఇదే. కానీ ఇకపై ఇలాంటి పని చేసే ముందు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించండి.. ఎందుకంటే

సినిమా థియేటర్‌లో లవర్‌తో హద్దులు మీరిన ప్రియుడు.. పోర్న్ సైట్‌లో వీడియోలు ప్రత్యక్షం
X

దిశ, సినిమా : సాధారణంగా ప్రేమికులు అంటేనే సినిమాలు, షికార్లు. కార్నర్ సీట్‌ తీసుకుని ఎంజాయ్ చేయడం. మూడు ముద్దులు, నాలుగు హగ్గులతో ఎంతో కొంత ప్రైవసీగా ఉండటం.. దాదాపు లవర్స్ అంతా చేసే పని ఇదే. కానీ ఇకపై ఇలాంటి పని చేసే ముందు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించండి.. ఎందుకంటే మీ వీడియో పోర్న్ సైట్‌లో ప్రత్యక్షం కావొచ్చు. మీ వీడియోలు లీక్ అయి ప్రపంచమంతా చూడొచ్చు.. అది మీ కంట లేదా మీ ఫ్యామిలీ, బంధువుల దగ్గరకు వెళ్లిందంటే జరగరానిది జరగొచ్చు. అనర్థాలకు దారితీయొచ్చు. ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా.. కానీ ఇప్పుడు ఇదో భయంకరమైన ట్రెండ్.

థియేటర్లలో ఈ మధ్య ఆల్మోస్ట్ సీసీటీవీలు ఉంటున్నాయి. కానీ ఈ విషయం తెలియని జనాలు తమ పనిలో తాము ఉంటున్నారు. ఆ పనులు కాస్త రికార్డ్ అవుతున్నాయి. ఇలాంటి ఇంటిమేట్ మూమెంట్స్ సీసీటీవీలో ఉంటాయని తెలిసిన హ్యాకర్స్.. సీసీటీవీ ఫుటేజీని హ్యాక్ చేసి.. సాఫ్ట్ పోర్న్‌గా అమ్ముకుంటున్నారు. కేరళలో ఇలాంటి ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో నిపుణులు జాగ్రత్తలు చెప్తున్నారు.

ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేదుకు థియేటర్లలో ఇంటిమేట్‌గా ఉండకపోవడమే మంచిదంటున్నారు. సీసీటీవీ కెమెరాలు 24 గంటలు రికార్డ్ చేస్తూనే ఉంటాయని.. ఈ పనులు మానుకుంటేనే సురక్షితమని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు సీసీటీవీ సిస్టమ్‌ను థియేటర్ యాజమాన్యాలు బలోపేతం చేయాలని.. స్ట్రాంగ్ పాస్‌వర్డులు, ఎన్‌క్రిప్టెడ్ నెట్ వర్క్ మెయింటెన్ చేయాలని సూచిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేయగల సిబ్బందిపై కఠిన పర్యవేక్షణ అవసరమని,రెగ్యులర్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ కూడా ఉండాలని చెప్తున్నారు.

Next Story