G.O.A.T నుంచి లవ్ సాంగ్ ‘ఒడియమ్మ’ రిలీజ్.. ఆకర్షణగా సుధీర్, దివ్య భారతి కెమిస్ట్రీ

by Chukka Sudharani |

క్రికెట్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘G.O.A.T ’.

G.O.A.T నుంచి లవ్ సాంగ్ ‘ఒడియమ్మ’ రిలీజ్.. ఆకర్షణగా సుధీర్, దివ్య భారతి కెమిస్ట్రీ
X

దిశ, సినిమా: క్రికెట్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘G.O.A.T ’. సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకి చేరుకుంది. ఇందులో భాగంగానే తాజాగా మేకర్స్.. ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్‌ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్‌ని మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ సాంగ్‌లో సుధీర్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ ప్లజెంట్‌గా ఉన్నాయి. ఈ లవ్ ట్రాక్ అందరికీ కనెక్ట్ కాగా.. ఈ ఆల్బమ్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇందులో మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story