- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ నా హృదయాన్ని చాలా సంతోషపరుస్తుంది.. రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ పోస్ట్..
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇక ‘పుష్ప’(Pushpa) మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే ఫేమ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ‘యానిమల్’(Animal) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
అయితే తెలుగులో కూడా రీసెంట్‌గా పుష్పకి సీక్వెల్‌గా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2) కూడా మంచి విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో అండ్ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.
అందులో రెడ్ కార్పెట్ పై నడిచిన వీడియో ఉండటం విశేషం. ఇక వాటికి.. ‘కొంతకాలం తర్వాత, నేను మళ్ళీ రెడ్ కార్పెట్ మీదకు వచ్చాను.. ప్రేమ అంతా నా హృదయాన్ని చాలా సంతోషపరుస్తుంది. ఆ రోజు నేను ఏమి ధరించానో మీకు చూపించాలనుకున్నాను.. నా బృందానికి అతి పెద్ద అభినందన.. వారు ఎల్లప్పుడూ నాకు వెన్నుదన్నుగా నిలిచారు.
ఈ చాలా కఠినమైన, బిజీగా ఉండే రోజులను నేను తట్టుకొని నిలబడటానికి ఏకైక మార్గం వారు మరియు నా కుటుంబం వల్లనే. మీలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కౌగిలింతలు’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా పారిస్‌లో ఈనెల 13వ తేదీన అట్టహాసంగా 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ వేడుక ఈనెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక ఈ రెడ్ కార్పెట్ పై రష్మిక బ్లాక్ శారీని డిఫెరెంట్ కట్టుకుని కనిపించింది.






