- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lokesh Kanagaraj : రజినీకాంత్, కమల్‌హాసన్ కాంబో.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)తో ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ చేయాలని గతంలో అనుకున్నాను. ఇది ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌కు సంబంధించిన కథ. కలమ్ అండ్ రజనీకి స్క్రిప్ట్ కూడా చెప్తే ఓకే అన్నారు. హీరోగా రజనీకాంత్.. ప్రొడ్యూసర్‌గా కమల్ హాసన్ (Kamal Haasan).. నేను డైరెక్టర్ ఇదే ప్లాన్. అయితే.. ‘విక్రమ్’, ‘జైలర్’ తర్వాత వాళ్ల మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడున్న రోజుల్లో ఆ ప్రాజెక్ట్ సిద్ధం చేయడం అవుతుందో లేదో చూడాలి. వాళ్ల ఉత్సహంగా ఉంటే ఇప్పుడు తెరకెక్కించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ‘కూలీ’ చిత్రం తర్వాత ఆయన కార్తీ ‘ఖైదీ-2’పై ఫోకస్ పెట్టనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ‘విక్రమ్-2’. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక రజినీ, కమల్ కాంబో తెరకెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
#Rajinikanth & #KamalHassan — directed by Lokesh 🥶🙏🔥 [Multistarrer]
— Movies4u Official (@Movies4u_Officl) May 11, 2025
"I’ve narrated a story to both Kamal Haasan and Rajinikanth sir about two aged gangsters. They were both excited, and we’re close to finalizing the project."
- #LokeshKanagaraj pic.twitter.com/hXhHIunWEX






