- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖైదీ-2 నుంచి వైదొలిగినట్లు వార్తలు.. లోకేశ్ క్లారిటీ
LCU ప్రాజెక్టు పక్కకు పెట్టి అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు సిద్ధం కావడంపై దర్శకుడు లోకేష్ స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలు చేసుకుంటూ ఇరగదీస్తున్నాడు లోకేష్. ఇప్పటికే చాలా సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న లోకేష్, అతి త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
ఈ నేపథ్యంలో లోకేష్ పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ లాంటి సినిమాలు చేయకుండా అల్లు అర్జున్ తో సినిమా చేయడం ఏంటని ట్రోలింగ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఖైదీ 2 సినిమా నుంచి వైదొలగలేదు
LCU ప్రాజెక్టు పక్కకు పెట్టి అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు సిద్ధం కావడంపై దర్శకుడు లోకేష్ స్పందించారు. మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్ తో చాలా కాలంగా ఉన్న కమిట్మెంట్ కారణంగా సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఖైదీ 2, విక్రం 2, రోలెక్స్ సినిమాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. రెమ్యూనరేషన్ కారణంగా ఖైదీ 2 నుంచి వైదొలిగినానేది అవాస్తవం అని స్పష్టం చేశారు లోకేష్.






