- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫస్ట్ షో కంటె ప్రాణాలు ముఖ్యం అంటున్న నెటిజన్స్
ప్రతీ గురువారం కొత్త సినిమాల విడుదలతో థియేటర్ల వద్ద జాతర వాతారవరణం ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రతీవారం కొత్త సినిమాల విడుదలతో థియేటర్ల వద్ద జాతర వాతారవరణం ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు అయితే ఇసుకవేస్తే రాలనంత మంది అభిమానులు ఫస్ట్ షో కోసం ఎగబడుతుంటారు. ఈ క్రమంలోనే రేపు ఎన్టీరఆర్-హృతిక్ రోషన్ ల 'వార్-2', రజినీకాంత్ 'కూలీ' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే టికెట్లు కూడా భారీగా బుక్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 'వార్-2' కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరోల సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే వీరందరికీ నెటిజన్స్ కీలక రిక్వెస్ట్ చేస్తున్నారు. అభిమాన హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలనుకోవడం సబబే కానీ, ప్రాణాలు అంతకంటే ముఖ్యమని చెబుతున్నారు. టికెట్ల కోసమో, థియేటర్ల వద్ద హడావిడి కోసమో ఎగబడి ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితుల్లో సినిమా చూడటానికి వెళ్లి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దని అంటున్నారు. సినిమా ఈరోజు కాకపోతే రేపైనా చూడవచ్చని, ప్రాణాలకు ఏమైనా జరిగితే మళ్ళీ తిరిగిరాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.






