- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాక్‌పాట్ కొట్టేసిన లిటిల్ హార్ట్స్ 'మౌళి'... మైత్రి బ్యానర్‌లో నెక్స్ట్ సినిమా
లిటిల్ హార్ట్స్ 'మౌళి' తన నెక్స్ట్ మూవీని మైత్రి సంస్థలో చేయనున్నట్లు, దానికి కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో యువ సంచలనంగా మారిన నటులలో మౌళి ఒకరు. ఈయన చాలా కాలం యూట్యూబ్ వీడియోలలో నటించి పాపులారిటీని సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితం ఈయన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన 90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్లో ముఖ్యపాత్రలో నటించాడు. ఈ సిరీస్ మంచి ప్రేక్షకాదరణ పొందడం, అందులో మౌళి తన నటనతో ఆకట్టుకోవడంతో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. కొంతకాలం క్రితం ఈయన లిటిల్ హార్ట్స్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటుడి క్రేజ్ మరింతగా పెరిగింది.
దానితో ఈ యంగ్ హీరో ఏ దర్శకుడితో, ఏ బ్యానర్లో నెక్స్ట్ సినిమా చేస్తాడు అనే ఆసక్తి చాలా మందిలో పెరిగింది. అలాంటి సమయంలో ఈ యువ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థలో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు విశ్వసనీయవర్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మౌళి తన నెక్స్ట్ మూవీని మైత్రి బ్యానర్లో చేయనున్నట్లు, దానికి ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.






