‘లిటిల్ హార్ట్స్’ ఒక నాన్‌సెన్స్ సినిమా.. స్క్రీన్‌పై ఏది పడితే అది చేశాడు: జగపతి బాబు

by Mallepaka Hamsa |

లిటిల్ హార్ట్స్ అనేది ఒక నాన్‌సెన్స్ సినిమా.. కానీ ఆ డైరెక్టర్ దానిని చాలా బాగా తీశాడు. నిజం చెప్పాలంటే అది ఒక పద్ధతి ప్రకారం సాగే సినిమా ఫార్మాట్ కాదు.. స్క్రీన్‌పై ఏది పడితే అది చేశాడు.

‘లిటిల్ హార్ట్స్’ ఒక నాన్‌సెన్స్ సినిమా.. స్క్రీన్‌పై ఏది పడితే అది చేశాడు: జగపతి బాబు
X

దిశ, సినిమా: ఒకప్పడు ప్యామిలీ హీరోగా తన నటనతో లేడీ ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన జగపతి బాబు ప్రస్తుతం పవర్ ఫుల్ విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘గోదావరి గట్టుపైన’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు ‘పెద్ది’ మూవీతో రాబోతున్నారు. బుచ్చిబాబు సనా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో మెప్పించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 4న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిన జగపతి బాబు.. పలు కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బ్లాక్ బస్టర్ సినిమా ‘లిటిల్ హార్ట్స్’పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జగపతి బాబు తనదైన శైలిలో మాట్లాడుతూ.. "లిటిల్ హార్ట్స్ అనేది ఒక నాన్‌సెన్స్ సినిమా.. కానీ ఆ డైరెక్టర్ దానిని చాలా బాగా తీశాడు. నిజం చెప్పాలంటే అది ఒక పద్ధతి ప్రకారం సాగే సినిమా ఫార్మాట్ కాదు.. స్క్రీన్‌పై ఏది పడితే అది చేశాడు.

చివరికి ఆ సినిమాలో చూపించింది అసలు క్లైమాక్సే కాదు. కానీ, విచిత్రం ఏంటంటే అదే అందరికీ బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా. ఆ చిత్రంలో ఉన్న ఆలోచనలు, కథను నడిపించిన ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చాయి" అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సాధారణంగా ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే జగపతి బాబు, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను మొదట ‘నాన్‌సెన్స్’ అంటూనే.. ఆ సినిమాలోని సరికొత్త ప్రయోగాన్ని, దర్శకుడి ఆలోచనా విధానాన్ని మెచ్చుకోవడం ఇప్పుడు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిన్న సినిమాను ఆయన అంతలా పొగడటంతో ‘లిటిల్ హార్ట్స్’ చిత్రబృందం కూడా ఫుల్ ఖుషీ అవుతోంది. మరోవైపు జూన్ 4న రాబోతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జగపతి బాబు పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందోనని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Next Story