- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
lik: 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ.. వేదిక ఖరారు
'lik' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 5, 2026 మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్ తాజాగా lik (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) చిత్రంలో హీరోగా నటించాడు. ఇందులో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటించగా, విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన తేదీ, వేదికను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 5, 2026న మధ్యాహ్నం 3 గంటల నుండి హైదరాబాదులోని పార్క్ హయత్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు జనాలను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.






